అంతరిక్షం నుంచి సూర్యోదయం సూర్యస్తమయం చూస్తే ఎలా ఉంటుందో చుడండి

భూమి మీద చీకట్లను చీల్చుకుంటూ ఉదయభానుడు మెలమెల్లగా పైకి వస్తూ వెలుగులు పంచే మనోహర దృశ్యం అద్భుతం. అదే అంతరిక్షం నుంచి సూర్యోదయం సూర్యఅస్తమయం చూస్తే అది మరింత అద్భుతంగా ఉంటుంది. సూర్యోదయాన మహా సముద్రం మీదుగా వెలుగు రేఖలు విచ్చుకుంటున్న ఈ సుందర దృశ్యాన్ని సాటిలైట్ తన కెమెరాలో బంధించి వీడియో ని శనివారం నెట్ లో విడుదల చేసారు.