హైదరాబాద్ : దోమలను చంపే హిట్ మందును కొట్టి భర్తను చంపిన భార్య

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో దారుణ సంఘటన జరిగింది. సోమవారం (ఆగస్టు-6) కుటుంబకలహాలతో భార్య.. భర్తను చంపేసింది. జాన్‌ జయసింగ్ బస్తీలో కొంతకాలంగా భార్య దేవిక, భర్త జగన్‌ కలిసి నివశిస్తున్నారు. రోజు తాగి వచ్చి కొడుతున్నాడన్న కోపంతో భార్య మత్తులో ఉన్న జగన్‌ నోట్లో దోమలను చంపే హిట్ మందును కొట్టి మరీ చంపేసింది సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితురాలు దేవికను అదుపులోకి తీసుకున్నారు.