MRP రేట్ల పైనే విక్రయించాలి : నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

హైదరాబాద్ లోని సినిమా హాల్ లు మల్టి ప్లెక్స్ లలో ఆగస్టు 1 నుంచి ఎమ్మార్పీకి మాత్రమే అన్ని రకాల ప్రొడక్టులను విక్రయించాలని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అకున్ సబర్వాల్ హెచ్చరించారు. MRP రేట్ల అదనంగా వసూలు చేసినట్టు తెలిస్తే, భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని అన్నారు.

మల్టీప్లెక్స్ లలో అమ్మే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ అందించే కంటెయినర్లపై ఎంత బరువు? ధర ఎంత? విషయాలు తప్పనిసరిగా ముద్రించాలని అకున్ సబర్వాల్ ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి 25 వేల రూపాయలు ఫైన్, రెండోసారి 50 వేల రూపాయల ఫైన్, మూడోసారి లక్ష రూపాయల జరిమానాతో పాటు 6 నెలల నుంచి ఏడాది వరకూ జైలు శిక్ష తప్పదని అన్నారు.