గూగుల్ లో ఏది దొరికినా.. అదొక్కటి దొరకదు అంటున్న కాజల్ అగర్వాల్

ఇప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా.. నెటిజనులందరూ జై గూగుల్ తల్లి అంటున్నారు. ప్రతీ చిన్న అంశాన్ని గూగుల్ లో వెతుకుతున్నారు. అయితే సెర్చింజిన్ గూగుల్ లో ఏది దొరకినా.. అదొక్కటి మాత్రం మనకు మనమే తెలుసుకోవాలి అంటున్నారు మిల్కీ బ్యూటి కాజల్ అగర్వాల్. ఇంతకీ గూగుల్ లో దొరకనిది.. ఏంటది.. అంటే..

 

మంచి వ్యక్తిత్వం మాత్రం మనకు మనమే తెలుసుకోవాలి. ఇటీవల గూగుల్ సెర్చింగ్ ఎక్కువైపోయింది. రన్నింగ్ లో బంగారు పతకం సాధించిన హిమ దాస్ గురించి వెంటనే వారి నేపథ్యం ఏంటి? కులం, గోత్రం, ఏమైన ఎఫైర్స్ ఉన్నాయా? ఇలా ప్రతీ విషయాన్ని గూగుల్ లో వెతుకుతున్నారు అంట. ఆ విషయం నచ్చని కాజల్ ఇలా చెప్పింది..