దేశంలోనే మొదటిసారి ఇద్దరు పోలీసులకు మరణ శిక్ష విధించిన కోర్ట్టు

దేశంలోనే మొదటిసారి కేరళలోని సీబీఐ కోర్టు ఇద్దరు పోలీసులకు కోర్టు మరణ శిక్ష విధించింది. అదే విధంగా అప్పటి కమిషనర్, సీఐ, ఎస్సైలకు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. కేసు వివరాల్లోకి వెళితే..

కేరళ లోని తిరువనంతపురం పోర్ట్ పోలీస్ స్టేషన్ 2005 సెప్టెంబర్ 27వ తేదీన రూ.4వేల చోరీ కేసులో ఉదయ్ కుమార్ అనే 26 ఏళ్ల యువకుడిని పార్కులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో అతను పోలీస్ స్టేషన్ లోనే చనిపోయాడు. పోస్టుమార్టం లో కుమార్ శరీరంలో 22 గాయాలు ఉన్నాయని ఎముకలు విరిగి కూడా ఉన్నాయని తేలింది. దీనిపై కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు అయ్యాయి. పోలీసుల వైఖరిపై నిరసనలతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అప్పట్లో కానిస్టేబుళ్లు కె.జితాకుమార్, ఎస్.వి.శ్రీకుమార్ లను సస్పెండ్ చేసింది ప్రభుత్వం.