ఆశ్చర్యం: ఈ గుడిలో విగ్రహం గాలిలో ఎలా తేలుతుంది?

భారతీయ సంస్కృతి , సంప్రదాయాలు , వారసత్వం గురుంచి ఎంత
తెలుసుకున్నా తక్కువే అని అనిపిస్తుంది. ప్రతీ కట్టడం , ఆలయం
వెనుక ఏదో ఓ ఆసక్తికరమైన కథలను మనం భారత దేశమంతటా
గమనించొచ్చు. అలాంటి కొన్ని ఆసక్తికరమైన కథల్లో నుండి మనం
ఈరోజు కోణార్క్ లోని సూర్య దేవాలయం గురుంచి తెలుసుకుందాం.. 

కోణార్క్ సూర్య దేవాలయంలోని ప్రధాన దేవుడి విగ్రహం గాల్లో తేలుతూ
ఉండేదట.. మరి అలా గాల్లో తేలుతూ ఉండడం వెనుక ఉన్న
రహస్యమేంటో తెలుసా..? పురాతన కాలంలో గడియారాలు లేని
సమయంలో టైంను ఈ గుడిలో ఉండే రధ చక్రాల ద్వారా
తెలుసుకునేవారట.. రధ చక్రాలను బట్టి సమయాన్ని ఎలా లెక్కించేవారో
తెలుసుకోవాలని ఉందా..? ఇలాంటివే కాకుండా కోణార్క్ లోని సూర్య
దేవాలయం గురుంచి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని మనం ఈరోజు
ఈ వీడియోలో తెలుసుకుందాం…