మహేష్ బాబు 25వ సినిమా సెట్ లో హంగామా చేసిన చరణ్ ఎన్టీఆర్ వీడియో

ఈ మధ్య టాలీవుడ్ అగ్ర హీరోల మధ్య మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి… ఇక ముఖ్యంగా రామ్ చరణ్, మహేష్ బాబు. జూ. ఎన్టీఆర్ ల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది.. ఇటీవల ఈ ముగ్గురు కలిసి బర్త్ డే పార్టీలు ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియా లో ఫొటోలు పెట్టి అభిమానులకు షాక్ ఇస్తున్నారు.. తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ బాబులు సందడి చేశారు.

తాజాగా మహేష్ బాబు 25వ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ కు బృందావనం, రామ్ చరణ్ కు ఎవడు వంటి సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిన సంగతి తెలిసిందే.. కాగా రామ్ చరణ్ ఎన్టీఆర్ లు రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్నది.