రాజకీయ నాయకుడంటే ఇతను : అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన MLA

ఊరిలో అనాధగా పడి ఉన్న మహిళ శవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకొన్నాడు MLA రమేష్. ఆ మహిళ మృతదేహాన్ని గ్రామస్ధులు ఎవ్వరూ పట్టించుకోక పోవడంతో విషయం తెలుసుకున్న MLA స్వయంగా తన కొడుకులతో కలసి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఈ ఘటన 3న జరిగింది.

ఈ దారుణం ఒడిషాలోని జర్సుగూడా జిల్లాలోని అమ్నపల్లి గ్రామంలో జరిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాధపడుతున్న ఆమె ఆగస్టు 3న చనిపోయింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు స్ధానికులు రాలేదు. ఒక రోజు అంతా ఆమె మృతదేహాన్ని పట్టించుకోలేదు. బెగ్గర్ మహిళ మృదేహాన్ని ఎవరైనా టచ్ చేస్తే తమ కమ్యూనిటీ వాళ్లు గ్రామ బహిష్కరణకు చేస్తారన్న భయంతో ఎవ్వరూ ఆమెకు అంత్యక్రియలు చేసేందుకు ముందుకురాలేదు. ఈ విషయం తెలుసుకున్న MLA స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకొన్నాడు.