యజమాని ప్రాణాలకు.. తన ప్రాణాలు అడ్డు పెట్టి కాపాడిన కుక్క

కుక్కలు విశ్వాసం చూపిస్తాయన్న మాట నిజమే.. తన యజమాని ఆపదలో ఉన్న విషయం తెలుసుకున్న ఓ కుక్క తన ప్రాణాలు అడ్డుగా పెట్టిం సింహం తో పోరాడి యజమాని ప్రాణాలు కాపాడింది ఓ పెంపుడు కుక్క, ఏకంగా మూడు సింహాలకు ఎదురు నిలిచి తన యజమానిని రక్షించింది. గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా అంబార్ది గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జులై 21న గొర్రెల కాపరి భవేశ్‌ హమిర్‌ భర్వాద్ తన గొర్రెలను సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అటవీ ప్రాంతంలో గొర్రెలు మేత మేస్తుండగా మూడు సింహాలు వాటిపై దాడి చేశాయి. గొర్రెలను రక్షించుకునేందుకు భవేశ్‌ తీవ్ర ప్రయత్నం చేశాడు అప్పుడు సింహాలు భర్వాద్‌పై కూడా దాడి చేశాయి.

 

యజమాని పై సింహాలు దాడి చేయడాన్ని గమనించిన కుక్క సింహాలతో సమరానికి దిగింది. యజమానికి కాపాడుకునేందుకు గట్టిగా అరుస్తూ సింహాల దగ్గరకు పరుగెత్తుకు వచ్చి బెదిరించే ప్రయత్నం చేసింది. దీంతో కుక్క అరుపులు విన్న స్థానికులు క్షణాల్లో పరుగెత్తుకు వచ్చారు. జన సమూహాన్ని చూసిన సింహాలు అక్కడి నుంచి అడవిలోకి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాయి. అయితే యజమానికి కాపాడుకునేందుకు కుక్క చేసిన దైర్యాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఈ ఘనట గుజరాత్‌లోని సవెర్కుడ అంబార్డిలో చోటు చేసుకుంది.