జబ్బులొస్తున్నాయి అని పానీపూరీల అమ్మకాలపై బ్యాన్ విధించారు

గుజరాత్ లోని వడోదర ప్రజలకు పానీపూరి తినే అవకాశం లేదు. పానీపూరీల అమ్మకాలపై వడోదర నగర మున్సిపాలిటీ నిషేధం విధించింది. వర్షాకాలం కావడంతో శుభ్రత లేకుండా తయారు చేసే పానీపూరిని తినడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వడోదర మున్సాపాలిటీ అధికారులు తెలిపారు. శుభ్రత లేకుండా తయారుచేసే పానీపూరి తినడం వల్ల టైఫాయిడ్, జాండీస్ వంటి రోగాలు వ్యాపిస్తున్నాయని అధికారులు తెలిపారు.

కొన్ని పానీపూరి తయారీ చేసే ప్లేస్ లలో అధికారులు రెయిడ్ చేశారు. పానీపూరి తయారుచేయడానికి వినియోగిస్తున్న పాడైపోయిన పిండిని, కుళ్లిపోయిన బంగాలాదుంపలు, ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ఆయిల్ ను, కలుషితమైన నీరుని అధికారులు స్వాధీనం చేసుకొని వాటిని పారేశారు. వర్షాకాలం సీజన్ ముగిసేవరకూ ఎవ్వరూ కూడా పానీపూరీ అమ్మడానికి వీల్లేదని పుడ్ బిజినెస్ మ్యాన్ లకు మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. పానీపూరీపై నిషేధం విధించడంతో సిటిలోని పానీపూరీ ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.