దేశంలో ఇప్పుడు ఈ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది

దేశంలో ఇప్పుడు ఈ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది ఫోన్ లో నెట్ బ్యాంకింగ్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు క్రెడిట్, డెబిట్ కార్డుల పిన్ నంబర్ల ఆధారంగా అకౌంట్లలో డబ్బు ఖాళీ చేసిన సైబర్ నేరగాళ్లు తాజాగా కొత్త తరహా మోసాలకు తెరతీశారు. అప్పటివరకు బాగా పనిచేస్తున్న ఫోన్ లో నెట్ వర్క్ జీరో అవుతుంది. కొంత సమయం తర్వాత మీ నెట్ వర్క్ లో సమస్య ఉందంటూ సంబంధిత నెట్ వర్క్ నుంచి ఓ ఫోన్ కాల్ చేస్తారు… తర్వాత మీ మొబైల్ కీప్యాడ్ లో ఒకటి ప్రెస్ చేయమంటారు.

ఒకటి నొక్కగానే మీ ఫోన్ లో మరోసారి నెట్ వర్క్ జీరో అవుతుంది. అంతే మీ ఫోన్ హ్యాక్ కి గురవుతుంది. దీని పేరే స్విమ్ స్వాప్ ఫ్రాడ్. ఫోన్ హ్యాక్ కి గురైందన్న విషయం మనకు తెలిసే లోపే…మన బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదు మొత్తం క్షణాల్లో ఖాళీ అయిపోతుంది. ఫోన్ హ్యాక్ కి గురవడం, పనిచేయకపోవడంతో మన అకౌంట్ నుంచి డబ్బు ఖాళీ అయిన సమాచారం బ్యాంకు ద్వారా సంక్షిప్త సమాచారం కూడా వచ్చే అవకాశం ఉండదు.