సోమనాథ్ గిరం-  చాయ్ వాలా టు ఛార్టర్డ్ అకౌంటెంట్, ఇప్పుడు మహారాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఎడ్యుకేషన్

Somnath Giram An Tea Seller To Become Maharashtra’s Brand Ambassador For Education, Here’s Why?
ఛార్టర్డ్ అకౌంటెంట్ అనగానే అమో ఆ కోర్స్ ఆ చాలా కష్టం చేయడం అని అనుకునే యువతకి సోమనాథ్ గిరం ఒక ఆదర్శప్రాయం. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన చదువులతల్లి వారసుడు. 28 ఏళ్ళ సోమనాథ్ గిరం మహారాష్ట్ర లోని పూణే నివాసస్తుడు. తన కుటుంబ జ్జీవనం కోసం చాయ్ అమ్మేవాడు. అటువంటి వ్యక్తి ఈ రోజున “మహారాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఎడ్యుకేషన్” గా ఎదిగాడు. ఒకానొక సమయంలో తన BCOM కుడా పూర్తి చేయలేని పరిస్తుతుల్లో తన సొంత గ్రామం అయిన షోలాపూర్ వదిలి పూణే వచ్చాడు. నరేంద్ర మోడీ అన్నట్టుగా” ఒక చాయ్ అమ్మేవాడు దేశానికి ప్రధాన మంత్రి కాలేడా” అని ప్రశ్నించగా ప్రపంచం మొత్తం విన్నది, ఈ మాటలే సోమనాథ్ కి మంచి ప్రేరణ ఇచ్చాయి, ఇప్పుడు ఇంతటి వాడిని చేసాయి.

Somnath-Giram-Life-Story

DNAకి ఇచిన ఇంటర్వ్యూ లో సోమనాథ్ తన ప్రస్థానం గురించి ఇలా చెప్పుకొచ్చాడు, 2008లో పూణే వచన కొత్తలో తన వద్ద ఏమి లేవన్నాడు చదువుకోవాలని ఆశ తప్ప. 2010 లో CA ఆర్టికల్ షిప్ ఒక ప్రైవేటు కంపెనీ లో చేసాడు కాని కామన్ ప్రోఫిషియన్శి టెస్ట్ పాస్ కాలేదు. అప్పుడు పూట గడవటం కోసం సదాశివ్ పేత్ ఏరియా లో ఒక చిన్న టీ స్టాల్ పెట్టాడు. కాలంతో పాటు వ్యాపారం కుడా పెరిగింది. ఆర్ధికంగా కొంచం స్దిరపడ్డాక తనలో దాగి ఉన్నCA కావాలి అన్న కోరికను సాకారం చేసుకోవాలని, ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. చివరికి తన కళ సాకారం చేసుకున్నాడు. మహారాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఎడ్యుకేషన్ గా ప్రబుత్వం గుర్తించాక రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు సందర్శించి తన జీవితంలో ఎలా ఎదిగాడో, Earn and Learn అనే ఒక సిద్ధాంతం తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందో అందరితో పంచుకున్నాడు.

Maharashtra’s Brand Ambassador For Education

ఒక CA గా తన బాద్యతలు నిర్వర్ర్తిస్తునా తనను ఆపద సమయంలో కాపాడిన టీ స్టాల్ ని ఇప్పటికి వేరే వారి సాయంతో అదే స్థానంలో కొనసాగిస్తున్నాడు అది అతని గొప్పతనం. ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ చదువుని మధ్యలోనే ఆపేసిన చాలామంది యువతకి సోమనాథ్ జీవితం ఒక ఆదర్శం కావాలని మనం అందరం ఆశిద్దాం.CA-somnath-Giram

English: Somnath Giram An Tea Seller To Become Maharashtra’s Brand Ambassador For Education, Here’s Why? CA Somnath Giram Story,Somnath Giram Earn and Learn Policy