యాదాద్రి లో మరో దారుణం వ్యభిచార గృహాలలో బంకర్లు.. చూసి షాక్

యాదాద్రి లో అమ్మాయిల అక్రమ రవాణాలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. భువనగిరి యాదాద్రి జిల్లాలో వ్యభిచార గృహాలపై నిర్వహించిన గ్రౌండ్‌ రిపోర్ట్‌లో దారునాలు . అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠా… పోలీసుల కళ్లు గప్పడానికి బెడ్‌రూమ్స్‌లో రహస్య గదులు ఏర్పాటు చేసుకున్నారు.

ఆపరేషన్ ముస్కాన్.. ఆడ బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు యాదాద్రి పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారు, వ్యభిచార కూపం నుంచి విముక్తి పొందిన చిన్నారుల్లో తమ పాపలు ఉన్నారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనిపించకుండా పోయిన తమ పిల్లల వివరాలను, వారికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు చూపిస్తున్నారు.